fbpx
Saturday, January 18, 2025
HomeTelanganaఅధికారులు నిద్రపోతున్నారా? - తెలంగాణ హైకోర్టు

అధికారులు నిద్రపోతున్నారా? – తెలంగాణ హైకోర్టు

ARE-THE-OFFICIALS-SLEEPING-TELANGANA-HIGH-COURT

తెలంగాణ: అధికారులు నిద్రపోతున్నారా? – తెలంగాణ హైకోర్టు

నారాయణపేట జిల్లా మాగనూర్‌ జడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం, ప్రభుత్వ అధికారుల తీరుపై కఠిన వ్యాఖ్యలు చేసింది.

ప్రభుత్వ పాఠశాల భోజనాల నాణ్యతపై ప్రశ్నలు
మద్యాహ్న భోజనంలో నాణ్యత లోపించడంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ మధ్యాహ్న భోజనం వికటిస్తోందని కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు.

‘‘వారంలో మూడు సార్లు భోజనం వికటిస్తే..’’
‘‘వారంలో మూడు సార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారు? విద్యార్థుల ప్రాణాలు పోతే తప్ప స్పందించరా?’’ అని హైకోర్టు ప్రశ్నించింది.

పాఠశాలల భోజన నాణ్యతను నిర్లక్ష్యం చేయడమే ఈ సమస్యకు కారణమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

అధికారులపై కఠిన వ్యాఖ్యలు
‘‘అధికారులు హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే స్పందిస్తారా? వారికి కూడా పిల్లలు ఉన్నారు కదా! మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. పిల్లల ప్రాణాల విషయంలో నిర్లక్ష్యం చూపితే ఆ అధికారులను హాజరుకు ఆదేశించాల్సి వస్తుంది’’ అని కోర్టు పేర్కొంది.

తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
ప్రభుత్వ న్యాయవాదులు కౌంటర్‌ ఫైలింగ్‌కు వారం సమయం కోరగా, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

జిల్లా స్థాయిలో వివరాలు సేకరించడానికి అంత సమయం ఎందుకు కావాలని ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

పరిపాలనా నిర్లక్ష్యం: వరుస ఘటనలు
మాగనూర్‌ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనకు వారం రోజులు గడవకముందే మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.

29 మంది విద్యార్థులు భోజనం తిన్న తర్వాత వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.

విద్యార్థుల చికిత్స పరిస్థితి
వాంతులు చేయడంతో స్థానిక పీహెచ్‌సీకి తరలించిన విద్యార్థుల్లో ఏడుగురు వెంటనే కోలుకోగా, మిగిలిన 22 మందిని మక్తల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తాజా ఘటనతో ప్రభుత్వ పాఠశాలల్లో భోజన నాణ్యతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular