నందమూరి కల్యాణ్‌రామ్ నటించిన అర్జున్ S/O వైజయంతి సినిమా, థియేటర్లవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మళ్లీ ఆకర్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య మాస్ మసాలా సినిమాలతో ప్రేక్షకులు అలసిపోయిన వేళ, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ నుంచే మంచి హైప్ సృష్టించింది.
ఈ సినిమాలో కల్యాణ్‌రామ్, విజయశాంతి మధ్య తల్లీ కొడుకు బాండింగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, భావోద్వేగాలతో కూడిన పాత్ర కల్యాణ్‌రామ్ పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దిందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఓ యువకుడి జీవితంలో ఎదురయ్యే చాలెంజ్ లను ఆసక్తికరంగా చూపించేందుకు కథను పక్కాగా మలిచారు.
యాక్షన్ మిక్స్‌తో మాస్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్ విడుదల అనంతరం సోషల్ మీడియాలో విజయశాంతి డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఫ్యామిలీ సెంటర్లలో బాగానే సాగుతున్నాయి. వేసవిలో మంచి ఫ్యామిలీ హిట్ రాకపోయిన నేపథ్యంలో ఈ సినిమా ఆ ఖాళీని పూరించగలదన్న నమ్మకం పెరుగుతోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ వస్తే, ఓ బ్లాక్‌బస్టర్ దిశగా అడుగులు వేయడం ఖాయం.