నందమూరి కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన “అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి” సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా సూపర్ టాక్‌తో దూసుకెళుతోంది.
విడుదలైన తొలి రోజు నుంచే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా జరిగిన బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ, “దర్శకుడు ప్రదీప్ చిలుకూరిలో స్పార్క్ కనిపించింది. క్లైమాక్స్ సీన్ కోసం శ్రీకాంత్ విస్సా ఇచ్చిన ఐడియా సినిమాకు స్పెషల్ హైలైట్ అయింది” అన్నారు.
అలాగే తన సినిమాలపై నెగిటివ్ ట్రోల్స్ గురించి పట్టించుకోనని, డిస్ట్రిబ్యూటర్లు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పారు. విజయశాంతి కూడా ఈ విజయంపై స్పందిస్తూ, అసత్య ప్రచారాలపై అసహనం వ్యక్తం చేశారు. “ ట్రోల్స్ వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. సవరణ అవసరం ఉంది” అంటూ హితవు పలికారు.
ఆమె పాత్రపై కూడా సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్లైమాక్స్‌లో తల్లీ కొడుకుల భావోద్వేగ సన్నివేశం ప్రేక్షకుల మనసులను తాకుతోంది.
కల్యాణ్ రామ్ నటన, విజయశాంతి పవర్‌ఫుల్ డైలాగ్‌లు సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలిచాయి. వేసవిలో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు సరిపడే సినిమాగా “అర్జున్” నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.