టాలీవుడ్: ఈ మధ్య ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్ లో స్పోర్ట్స్ డ్రామాలు మరియు స్పోర్ట్స్ స్టార్స్ బియోపిక్స్ ఎక్కువగా రూపొందుతున్నాయి. ధోని, భాగ్ మిల్కా భాగ్ ఇప్పుడు సైనా. ఇవే కాకుండా తెలుగులో ఈ మధ్య వచ్చిన జెర్సీ, A1 ఎక్ష్ప్రెస్స్ , షూటింగ్ దశలో ఉన్న నాగ శౌర్య ‘లక్ష్య’, గోపి చంద్ ‘సీటీ మార్’ ఇలా చాలా సినిమాలే ఉన్నాయి. ప్రస్తుతం 1980 ల్లో కబడ్డీ ఆటలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఒక ఆటగాడి కథ ఆధారంగా రూపొందిన ‘అర్జున్ చక్రవర్తి’ అనే సినిమా రూపొందుతుంది. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన టీజర్ ని కబడ్డీ ఆటలో వాడే కూత అనే పదం జోడించి మొదటి కూత అని విడుదల చేసారు.
మార్చ్ 24 న ప్రపంచ కబడ్డీ దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది సినిమా టీం. ఒక గుర్తించబడని కబడ్డీ ఆటగాడి నిజ జీవిత కథ.. అంటూ చెప్పే నరేషన్ తో , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మధ్య లో రా రా అర్జున్ అంటూ వినపడే వాయిస్ తో వీడియో ఆకట్టుకుంది. అసలు ఎలాంటి స్టార్స్ ని చూపించకుండా విజువల్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో టీజర్ ద్వారా మంచి మార్కులు కొట్టేసింది సినిమా టీం. గానెట్ సెల్లులాయిడ్ బ్యానర్ పై శ్రీని గుబ్బాల నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. వేణు అనే నూతన దర్శకుడు ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. విజయరామరాజు అనే నూతన నటుడు ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.