కోలీవుడ్: ప్రముఖ విలన్ గా , బేస్ వాయిస్ తో మంచి గుర్తింపు పొందాడు అర్జున్ దాస్. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఖైదీ, మాస్టర్ సినిమాల్లో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు అర్జున్ దాస్. అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో తమిళ్ లో ‘పొట్టుమ్… పొగట్టుమే‘ అనే పాట విడుదలైంది. ఇందులో అర్జున్ కి జోడీ గా అందాల రాక్షసి నటి లావణ్య త్రిపాఠి నటించింది. నిన్న విడుదలైన ఈ పాట సోషల్ మీడియా లో ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులని ప్రతిబింబించేలా 2050 లో ఉండే ఒక సిచువేషన్ ని క్రియేట్ చేసి ఈ పాటని అద్భుతంగా రూపొందించారు. ఈ పాట ఆడియో తో పాటు విజువల్ గా కూడా ఆకట్టుకుంటుంది. 2050 లో ఉండే ఒక వైరస్ తో పోరాడే అమ్మాయి, అలాంటి వైరస్ ఉన్న వాళ్ళందర్నీ ఒక హాస్పిటల్ లో బంధించడం, వాళ్ళని బయటకి రానివ్వకుండా అలాగే వాల్లకి సరైన ట్రీట్మెంట్ కూడా లేకుండా అదే హాస్పిటల్ లో ఉంచడం, బయట ఉన్న ఆ అమ్మాయి ప్రియుడు ఆమె కోసం వేచి చూడడం లాంటి కాన్సెప్ట్ జోడించి ఈ పాటని రూపొందించారు.
జెన్ మార్టిన్ మరియు సత్యజిత్ రవి సంగీతం లో ఈ పాట రూపొందించి. ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణ సినిమాటోగ్రఫీ, కలరింగ్. ప్రతీ ఫ్రేమ్ విజువల్ గా ఆకట్టుకుందని చెప్పవచ్చు. లియోన్ బ్రిట్టో ఈ పాటకి అందించిన విజువల్స్ అద్బుతంగా ఉన్నాయి . తమిళ్ లో రూపొందిన ఈ పాట ట్రేండింగ్ లో ఉంది ఆకట్టుకుంటుంది.