టాలీవుడ్: ప్రతి సంవత్సరం కొన్ని వందల సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. అందులో పదుల సంఖ్యలో హిట్లు, బ్లాక్ బస్టర్ సినిమాలు ఉంటాయి. కానీ అతి కొద్ది సినిమాలు అప్పుడపుడు వస్తుంటాయి, అవి ట్రెండ్ సెట్ చేసి పోతుంటాయి. అప్పటి వరకు సినిమా అంటే ఇలా ఉండాలి అన్న కోణాన్ని, ప్రేక్షకుడి దృష్టిని మార్చేస్తాయి. తెలుగు లో అప్పట్లో రామ్ గోపాల్ వర్మ , నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ‘శివ’ మళ్ళీ అంత రేంజ్ లో ట్రెండ్ సెట్ చేసిన సినిమాగా ‘అర్జున్ రెడ్డి’ సినిమా పేరు సంపాదించింది. ఇప్పటికీ ఏదో ఒక చోట అర్జున్ రెడ్డి వైబ్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఆ రకమైన ఆటిట్యూడ్, ఆ రకమైన భావోద్వేగాలు, ఆ పాటలు అడపాదడపా యూత్ లో ఇంకా కనిపిస్తూనే ఉంటాయి.
మన సినిమాల్లో రొమాంటిక్ సీన్స్, బోల్డ్ సీన్స్ ఎక్కువగా కనిపిస్తే వాటిని వెంటనే ఒక వేరే రకమైన సినిమాలాగా చూస్తారు తెలుగు వాళ్ళు. కానీ ఈ సినిమా ఆ ఆలోచన విధానాన్ని మార్చేసిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో లెక్కకి మించిన రొమాన్స్ సీన్స్, ముద్దు సీన్లు ఉన్నాయ్ కానీ వాటిని మించిన కథనం, హీరో, హీరోయిన్ల యాక్టింగ్ సినిమాని అందనంత ఎత్తులో నిలబెట్టాయి. ఈ ఒక్క సినిమాతో ‘విజయ్ దేవరకొండ’ ఒక్క తెలుగు లోనే కాకుండా దేశం మొత్తం చాలా ఫేమస్ అయ్యాడు. బాష అర్ధం కాకపోయినా సబ్ టైటిల్స్ తో ఈ సినిమా చూసిన వాళ్ళు చాలా మంది. ఈ సినిమాని హిందీ లో తమిళ్ లో కూడా రీ-మేక్ చేసారు. ఈ సినిమా తర్వాత విజయ్ దాదాపు ఒక 5 సినిమాలు చేసిన కూడా ఇంకా ఈ సినిమాతో పోలిక పెడ్తూ ఉంటారు అంటే చెప్పుకోవచ్చు ఈ సినిమా అభిమానుల గుండెల్లో ఎంతగా పాతుకుపోయిందో. ఈ సినిమా తర్వాత ఇలాంటి జానర్ సినిమాలు చాలానే వచ్చాయి కానీ ఈ సినిమా క్రియేట్ చేయగలిగిన ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాయి. మళ్ళీ సందీప్ రెడ్డి వంగ, విజయ్ కాంబో కోసం చాల మంది ఎదురు చూస్తున్నారు.