నిజామాబాద్: బీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, తెలంగాణ తల్లి విగ్రహ వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేటీఆర్, కవితల రాజకీయాలను ప్రజలు నమ్మడం లేదని, తాము ప్రజా సమస్యలపై రాజకీయం చేస్తామని స్పష్టం చేశారు. “కేటీఆర్, కవితలకు కుక్కలు కూడా ఓటు వేయవు” అని ఘాటుగా వ్యాఖ్యానించిన అరవింద్, బీఆర్ఎస్ వర్గాలకు షాక్ ఇచ్చారు.
కేటీఆర్‌ను “కేవలం ఓ ఎమ్మెల్యే”గా అభివర్ణిస్తూ, వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోతారని, డిపాజిట్ కూడా దక్కదని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్-కాంగ్రెస్‌లు విగ్రహ రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ ప్రజల సమస్యలపై నిలుస్తుందని, ఇలాంటి అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వబోమని స్పష్టం చేశారు.
అరవింద్ వ్యాఖ్యలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో విభేదాల నేపథ్యంలో చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో మరింత వేడి రాజకీయం తెచ్చే సూచనలున్నాయి. బీజేపీ ప్రాబల్యం తగ్గదని ధీమాగా చెప్పిన అరవింద్, తమ పార్టీ ప్రజా సమస్యలపై ముందడుగు వేస్తుందని పేర్కొన్నారు.