కోలీవుడ్: తమిళ నటుడు ఆర్య ప్రస్తుతం ‘సర్పట్టా‘ అనే స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా లో నటించాడు. బ్రిటిష్ పాలనలో లో ఉన్న ఇండియా కాలం నాటి సినిమాగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్స్ , ఆర్య లుక్ ఈ సినిమా పైన ఇంటరెస్ట్ క్రియేట్ చేసాయి. ఈ సినిమా వచ్చే వారంలో ఓటీటీ లో విడుదల అవనుంది. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల చేసారు.
మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆరంభం లో బాక్సింగ్ లో గెల్చిన వాళ్ళు తమ నాయకుడు అన్నట్టు ఒక ఊరి ప్రజలు మాట్లాడుకోవడం చూపించారు. మొదట్లో ఊరంతా ఒకే వర్గం గా ఉంది బ్రిటిష్ వారితో బాక్సింగ్ లో పోటీ చేసి గెలిచి నాయకుడిని ఎన్నుకునేవాళ్ళు. పోను పోను మన వాళ్లలోనే వర్గాలు ఏర్పడి మనలో మనవాళ్లతోనే కొట్లాడి నాయకుడిని ఎన్నుకోవడం మొదలయింది. అలాంటి సమయంలో ఆ వూరిలో వెనకబడిన జాతి అని పిలువబడి, అసలు పోటీ కి అర్హత లేదు అన్న వర్గం లో ఉన్న వర్గం నుండి ఆర్య పోటీ లో నిలబడి ఎలా గెలవగలిగాడు అనేది సినిమా కథ అని తెలుస్తుంది.
ఈ క్రమం లో ఆర్య ఎదుర్కొన్న పరిస్థితులు, జాతి వివక్ష ఎలా ఉండబోతుంది అని పా.రంజిత్ మరో సారి సమాజంలో ఉన్న వివక్ష ని హైలైట్ చేస్తూ ఈ సినిమాని రూపొందించినట్టు తెలుస్తుంది. రంజిత్ రూపొందించిన ‘మద్రాస్’, ‘కాలా’ లాంటి సినిమాల్లో కూడా ఇంచుమించు ఇదే ఎలిమెంట్స్ ని టచ్ చేసారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. K9 స్టూడియోస్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్ పై షణ్ముగం దక్షన్రాజ్ ఈ సినిమాని నిర్మించారు. జులై 22 న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో ఈ సినిమా విడుదలవనుంది.