కోలీవుడ్: ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తే ఎక్కువగా బయోపిక్ లు లేదా స్పోర్ట్స్ డ్రామాలు లేదా మరేదైనా యదార్థ కథ ఆధారంగా రాసుకున్న కథలు వస్తున్నాయి. అలాంటి ఒక ప్రయత్నమే తమిళ్ హీరో ఆర్య కూడా చేస్తున్నాడు. ‘నేనే అంబానీ’, ‘రాజా రాణి’ సినిమాల ద్వారా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆర్య. గత కొన్ని సంవత్సరాలుగా మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘మద్రాస్’ ,’అట్ట కత్తి’ లాంటి నేటివ్ చెన్నై కథలను సినిమాలుగా తీసి తర్వాత సూపర్ స్టార్ రజిని కాంత్ తో వరుసగా ‘కబాలి’, ‘కాలా’ లాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన పా.రంజిత్ , ఆర్య తో కలిసి ఒక స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా కూడా నేటివ్ చెన్నై నేపధ్యాన్ని ఎంచుకున్నట్టు అనిపిస్తుంది. అంతే కాకుండా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ని బట్టి చూస్తుంటే ఇదొక పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా లాగా అనిపిస్తుంది.
ఈ సినిమా ప్రీ లుక్ కి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ విడుదల చేసారు మూవీ మేకర్స్. ఆర్య ని ఒక వింటేజ్ బాక్సర్ రూపం లో ప్రెసెంట్ చేస్తూ ‘సర్పట్ట’ అనే టైటిల్ పోస్టర్ విడుదల చేసారు. ఆర్య పోస్టర్ లో ఆకట్టుకున్నాడు. బాక్సర్ లుక్ కోసం ఆర్య బాగానే కష్టపడ్డట్టు తెలుస్తుంది. ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ సాధించాలని ఆర్య ప్రయత్నిస్తున్నాడు. పా.రంజిత్ తో కలిసి ఇదివరకు మంచి సంగీతం అందించిన సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. కె9 స్టూడియోస్ బ్యానర్ పై షణ్ముగం దక్షణరాజ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.