దిల్ రాజు వారసుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో అశీష్, ఇప్పటివరకు యూత్‌ఫుల్, అర్బన్ సినిమాలతో కనిపించాడు. కానీ ఇప్పుడు మాత్రం ఓ మాస్ బిల్డప్‌కు సిద్ధమవుతున్నాడు. తెలంగాణ నేపథ్యంలో, ఊరి గట్టు, బతుకమ్మ సంబరాలతో కలిసిన కథతో మాస్ ఎంటర్టైనర్‌కు అశీష్ రెడీ అవుతున్నట్టు సమాచారం.
సుకుమార్ – రామ్ చరణ్ కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ఆంధ్రా నేటివిటీని తెరపై ఆవిష్కరించినట్టే, ఈసారి అశీష్ కథలో తెలంగాణ మట్టిని ప్రాముఖ్యంగా చూపించబోతున్నారు. ఫోక్ మ్యూజిక్, డైలెక్ట్, కాస్ట్యూమ్స్, విలేజ్ ఎమోషన్, కుటుంబ బాంధవ్యాల మధ్య విరిసే కథగా ఉండబోతుందని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కు ఓ కొత్త దర్శకుడు మెగాఫోన్ పట్టబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రోమో షూట్ స్టార్ట్ అయిందని, త్వరలో అశీష్ లుక్‌తో పాటు పూర్తి డీటెయిల్స్ వెల్లడించనున్నట్టు సమాచారం. అశీష్ కూడా రఫ్ లుక్ కోసం వర్క్‌షాప్‌లో పాల్గొంటున్నాడు.
ఇంతవరకు మోడరన్ రోల్స్ చేసిన అశీష్ ఈసారి పూర్తి మాస్ అవతారంలో కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అతను తన కెరీర్‌లో నెక్ట్స్ లెవెల్‌కు చేరుతాడా? ‘రంగస్థలం’ తరహాలో ఓ రూరల్ మాసివ్ హిట్ అందుకుంటాడా? అనే ఆసక్తికర చర్చలు ఇప్పటికే టాలీవుడ్‌లో ఊపందుకున్నాయి.
Ashish New Movie, Dil Raju Production, Telangana Backdrop, Rangasthalam Style, Sri Venkateswara Creations,