మూవీడెస్క్: ప్రముఖ యాంకర్, డైరెక్టర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు తన బాడీ లాంగ్వేజ్‌కి తగిన కథలను ఎంచుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. తాజాగా ఆయన శివమ్ భజే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
సస్పెన్స్‌తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. మహేశ్వర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అప్సర్ దర్శకత్వం వహించారు. మంగళవారం ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.
దేశంలో అల్లకల్లోలాన్ని సృష్టించడానికి కొన్ని దుష్టశక్తులు రంగంలోకి దిగుతాయి. మరో వైపు నగరంలో మిస్టీరియస్ హత్యలు జరుగుతాయి.
ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేది పోలీస్ డిపార్ట్మెంట్‌కు సవాలుగా మారుతుంది. ఈ సమయంలో హీరో రంగంలోకి దిగుతాడు.
అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది అనేదే కథ. దిగంగనా సూర్యవన్షి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అర్భాజ్ ఖాన్, మురళీశర్మ, తులసి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఆగస్టు 1వ తేదీన ఈ సినిమాను విడుదల అవనుంది.