fbpx
Tuesday, December 24, 2024
HomeInternationalఅస్ట్రాజెనెకా తో పెరుగుతున్న ఇమ్మ్యూనిటీ

అస్ట్రాజెనెకా తో పెరుగుతున్న ఇమ్మ్యూనిటీ

ASTRAZENECA-VACCINE-IMPROVING-IMMUNITY-FOR-AGED-AND-YOUTH

లండన్‌: కోవిడ్‌-19 కట్టడికి తయారీలో ఉన్నా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ సీనియర్‌ సిటిజెన్స్‌లో రోగనిరోధక శక్తిని బలంగా పెంచుతున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ తాజాగా తమ పరిశొధన ఫలితం వెల్లడించింది. క్లినికల్‌ పరీక్షల రెండో దశలో భాగంగా 56-69 ఏళ్ల వయసు వ్యక్తులలో తమ వ్యాక్సిన్‌ పటిష్టమైన ఫలితాలను సాధించినట్లు తెలిపింది.

కరోనా కారణంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే 70 ఏళ్ల వయసు వ్యక్తులతోపాటు, యువకులు యువతుల పై కూడా ఒకే స్థాయిలో ఇమ్యూనిటీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేసింది. రెండో దశ పరీక్షలలో భాగంగా 560 మందిపై వ్యాక్సిన్‌ను పరిశీలించినట్లు వెల్లడించింది. వీరిలో 240 మంది సీనియర్‌ సిటిజెన్స్‌ ఉన్నారని తెలిపింది.

బ్రిటిష్ కు చెందిన ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకాతో సంయుక్తంగా రూపొందిస్తున్న వ్యాక్సిన్ కూడా‌ ప్రోత్సాహకర ఫలితాలను వెలువరించినట్లు తెలియజేసింది. వ్యాక్సిన్‌ వినియోగంతో యాంటీబాడీ, టీసెల్స్‌ బలమైన రెస్పాన్స్‌ను కనబరచిరినట్లు వివరణ ఇచ్చింది. ఈ విషయాలను తాజాగా లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించింది.

తమ మూడో దశ క్లినికల్‌ పరీక్షల ప్రాథమిక డేటా తదుపరి వారాల్లో వెల్లడించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. తద్వారా సమాజంలోని భిన్న వ్యక్తులకు రక్షణ కల్పించగల అంశంపై మరిన్ని వివరాలు అందగలవని తెలియజేసింది. ఏ జెడ్ డి1222 పేరుతో రూపొందించిన ప్లాసెబో, వ్యాక్సిన్‌ను రెండు డోసేజీలలో తీసుకున్న వాలంటీర్లలో ఎలాంటి ఇతర ఇబ్బందులూ తలెత్తలేదని వివరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular