మూవీ డెస్క్: యండమూరి నవల ఆధారంగా తాజాగా “అతడు ఆమె ప్రియుడు” ద్వారా మళ్లీ దర్శకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ విడుదలైంది. యండమూరి రచనా శైలి, దర్శకత్వంతో పాటు ఆకట్టుకునే టైటిల్ కూడా అవడంతో ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
బెనర్జీ, సునీల్, కౌషల్ పాత్రల చుట్టూ నే ఈ మొత్తం సినిమా కథ తిరుగుతుంది. ప్రకృతిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుని ప్రళయం రాబోతున్నట్లు కొన్ని వార్తలు రావడం దానికనుగుణంగా ఉరుములు మెరుపులతో భయంకరమైన గాలి వాన మొదలౌతుంది. ఆ సమయంలో కౌషల్, సునీల్ బెనర్జీ ఇంట్లో ఆశ్రయం పొందుతారు.
ఇంకొన్ని గంటల్లో యుగాంతం అవబోతోందని ఆ ఇంట్లో ఉన్న తమ ముగ్గురికే బతికే అవకాశం ఉందని చెబుతాడు. అయితే తమలో ఒకరు ప్రాణ త్యాగం చేసి వారి స్ధానంలో ఒక స్త్రీకి అవకాశం ఇస్తే భవిష్యత్తులో మానవజాతి అంతం కాకుండా ఉంటుందని బెనర్జీ చెబుతాడు. దాంతో కౌషల్, సునీల్ ఆలోచనలో పడతారు. అసలు ప్రకృతి విపత్తు రావడానికి కారణం ఏంటి? బెనర్జీకి మాత్రమే తెలిసిన ఆ రహస్యం ఏంటి? సునీల్, కౌశల్ లో ఎవరు ప్రాణ త్యాగం చేస్తారు? ఆ ఇంట్లో అడుగుపెట్టిన స్త్రీ ఎవరు? బెనర్జీ చెప్పినట్లు యుగాంతం అవుతుందా?అన్నదే సినిమా కథ.
సినిమాలోని సంభాషణలు కొన్నిచోట్ల ఆలోపించే చేసేలా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనసుని హత్తుకునేలా ఉంది. కథని రక్తి కట్టించేలా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయినప్పటికీ సీన్ బై సీన్ ప్రేక్షకుల్లో మరికొంత ఉత్కంఠ కలిగించేలా చూపించి ఉంటే ఇంకా బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా ప్రేమంటే సెక్స్, స్నేహమనే భావనలో ఉంటున్న యూత్ కి ఈ సినిమా ద్వారా రచయిత మంచి మెసేజ్ ఇచ్చాడని చెప్పవచ్చు.