టాలీవుడ్: వెళ్ళిపోమాకే అనే సాఫ్ట్ కారెక్టర్ తో పరిచయం అయ్యి ఈ నగరానికి ఏమైంది , ఫలక్నుమా దాస్ సినిమాలతో తన ఇమేజ్ ని పెంచుకుని యూత్ లో మంచి ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న నటుడు విశ్వక్సేన్. హిట్ అనే సినిమాలో పోలీస్ గా నటించి ఇంకో హిట్ సాధించాడు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో ‘పాగల్’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తో పాటు మరొక సినిమాలో కూడా విశ్వక్ నటిస్తున్నాడు. ఈ రోజు ఆ సినిమా టైటిల్ ప్రకటించింది సినిమా టీం. ఈ సినిమా టైటిల్ మరియు పోస్టర్ డిజైన్ ఆసక్తికరంగా మరియు ఆహ్లాదంగా అనిపిస్తున్నాయి.
‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ – ఈ టైటిల్ వినగానే మంచి పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్నాయి. సరిగ్గా అక్కడే మొదటి అడుగు పక్కా గా వేసింది ఈ సినిమా టీం. ఇలాంటి టైటిల్ తోనే చాల మంది చూపుని తన వైపు తిప్పుకున్నాడు విశ్వక్. అంతే కాకుండా ఈ సినిమా పోస్టర్ కూడా పల్లెటూర్లో ఒక బ్రిడ్జి పై బస్సు వెళ్తున్నట్టు చూపారు. హీరోకి, హీరోయిన్ కి సంబందించిన ఎలాంటి లుక్స్ లేకుండా కేవలం ఒక విలేజ్ ని చూపించారు. ఎస్.వీ.సి.సి. డిజిటల్ బ్యానర్ పై బి.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విద్యా సాగర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నటించే నటుల గురించి మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.