టాలీవుడ్: టాలీవుడ్ క్రేజీ హీరో ప్రభాస్ లైన్ అప్ లో ఉన్న సినిమా ‘సలార్‘. ఈ మధ్యనే ఈ సినిమా టైటిల్ పోస్టర్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ అధికారికంగా విడుదల చేసారు. కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందబోతుంది. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అది పూర్తి అయిన తర్వాత ఓం రౌత్ దర్శకత్వం లో ఆదిపురుష్ మరియు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం లో మరొక సినిమా కూడా ఉన్నాయి. అయితే ఏ సినిమా ముందు వస్తుంది లాంటి వివరాలు ఏమి ప్రకటించలేదు కానీ అన్ని సినిమాల ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే వేగంగా సాగుతున్నాయి. ప్రశాంత్ నీల్ కూడా కెజిఫ్ చాప్టర్ 2 ని పూర్తి చేసి విడుదలకి సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.
అయితే ఈ ‘సలార్ ‘ సినిమా కోసం అన్ని రకాల కారెక్టర్ల కోసం ఆడిషన్లు నిర్వహించనున్నారు. ఈ ఆడిషన్లు కూడా వివిధ సిటీల్లో చెయ్యనున్నారు. మొదట హైదరాబాద్ లో నిర్వహించి ఆ తర్వాత బెంగుళూరు మరియు చెన్నై ల్లో కూడా నిర్వహించనున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో అన్ని క్యాటగిరీస్ పాత్రల కోసం ఈ నెల 15 న హైదరాబాద్ లో ఆడిషన్స్ కోసం పిలుపునిచ్చారు. ఇందుకోసం ఒక నిమిషం నిడివి ఉన్న వీడియో ఏ భాషలో అయినా తయారు చేసి తీసుకెళ్లాలి. హైదరాబాద్ లో శేరి లింగంపల్లి లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఆడిషన్స్ నిర్వహించనున్నట్టు అధికారిక నోట్ విడుదల చేసారు మేకర్స్.