fbpx
Tuesday, December 24, 2024
HomeInternationalఆస్ట్రేలియాలో పటిష్ఠంగా లాక్ డౌన్ అమలు

ఆస్ట్రేలియాలో పటిష్ఠంగా లాక్ డౌన్ అమలు

AUSTRALIA-IMPLEMENTING-LOCKDOWN-STRICTLY

మెల్‌బోర్న్‌: కరోనా మహమ్మారి‌ పుట్టి ఏడాది కూడా పూర్తయి పోయింది. అయితే ఇంతవరకు మహమ్మారి పని పట్టే వ్యాక్సిన్ మాత్రం సిద్ధం‌ కాలేదు. కానీ వైరస్‌ మాత్రం ఇంకా వీర విహారం చేస్తుంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం కోసం ఆయా దేశాలు మరోమారు లాక్‌డౌన్‌ని అమలు చేస్తున్నాయి.

ఈ జాబితాలో ఆస్ట్రేలియా కూడా ఉంది. దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వం సెకండ్‌ వేవ్‌ కట్టడి కోసం ఈ సారి మరింత పటిష్ఠంగా లాక్‌డౌన్‌ ను అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దాని ప్రకారం ఔట్‌డోర్‌ ఎక్సర్‌సైజ్‌‌, డాగ్‌ వాకింగ్‌ వంటి కార్యక్రమాలని బ్యాన్‌ చేసింది.

కాగా వారంలో ఆరు రోజుల్లో ఇంటికి కేవలం ఒక్కరికి మాత్రమే బయటకు వెళ్లడానికి అనుమతిస్తామని, అది కూడా చాలా ముఖ్యమైన కారణాలకు మాత్రమే అని పేర్కొంది. స్కూళ్ళు, కాలేజీలు, రెస్టారెంట్లు మరియు యూనివర్సిటీలు, కేఫ్‌లను నిర్ణిత గడువు వరకు పూర్తిగా ముసి ఉండాలని తెలిపారు.

పెళ్లిల్లు, చావులకు సంబంధించిన కార్యక్రమాలపై కూడా పూర్తి నిషేధం విధించింది. ఇక మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేసింది. ఈ నియమాలన్ని నేటి నుంచి అమల్లోకి వస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular