కాన్‌బెర్రా: ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉంది. భారత్ లో రోజుకు లక్షలాదిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చాలా దేశాలు భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి.
ఇదే బాటలో ఆస్ట్రేలియా మరొక పెద్ద ముందడుగు వేసి మరింత కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఉన్న తమ దేశ పౌరులు 14 రోజుల్లోగా తాము భారత్ నుంచి స్వదేశానికి వెళ్లాలని భావిస్తున్న వారిపై నిషేధం విధించింది. తమ ఈ నిర్ణయాన్ని లెక్కచేయకుండా ప్రవేశించిన పౌరులకు ఐదు ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 3 నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ తాత్కాలిక నిషేధ్ఞాలను శుక్రవారం రోజున ఆస్ట్రేలియా ప్రభుత్వం విధించింది. తమ దేశానికి తిరిగి వచ్చే ఆస్ట్రేలియా పౌరులపై జైలు శిక్ష విధించడం ఇదే తొలిసారి.