ఢాకా: బంగ్లాదేశ్ లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆగస్టు నెలలో పర్యటించబోతోంది. కాగా బంగ్లాదేశ్‌తో ఆసీస్ ఈ పర్యటనలో 5 టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. ఆగస్టు 3న ఈ సిరీస్ ప్రారంభం అవుతుందని బంగ్లా క్రికెట్ బోర్డు క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ అక్రమ్ ఖాన్ ధృవీకరించారు. అయితే 2017 తర్వాత తొలిసారి ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్ లో పర్యటన చేయనుంది. ఆసీస్ ప్రస్తుతం వెస్ట్‌ఇండీస్ పర్యటనలో ఉంది, అది పూర్తవగానే అక్కడి నుండి నేరుగా బంగ్లాదేశ్ వెళ్తుంది.
అయితే ఢాకాలో ఇప్పుడున్న కఠిన నిబంధనల మధ్య 3 రోజులు పాటు జట్టు క్వారంటైన్‌లో ఉండవలసి ఉంది. ఇంకో వైపు జింబావ్వే పర్యటనలో ఉన్న బంగ్లా జట్టు ఈ నెల 29న తిరిగి స్వదేశానికి రానుంది. బంగ్లా ఆసీస్ మధ్య జరిగే ఈ సీరిస్ లో మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు ఢాకా వేదికగా జరుగుతాయి. కాగా బంగ్లాదేశ్ తో సిరీస్‌కు సంబంధించి ఆస్ట్రేలియా ప్రస్తుతం వెస్టిండీస్‌తో ఆడుతున్న జట్టునే కొనసాగిస్తోంది.
బంగ్లా సిరీస్ కు ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అష్టన్ అగర్, వెస్ అగర్, జాసన్ బెహ్రిండోర్ఫ్, అలెక్స్ కారీ, డాన్ క్రిస్టియన్, జోష్ హాజిల్‌వుడ్, మోయిసెస్ హెన్రిక్స్, మిచెల్ మార్ష్, బెన్ మెక్‌డెర్మాట్, రిలే మెరెడిత్, జోష్ ఫిలిప్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వీప్సన్, అష్టన్ టర్నర్, ఆండ్రూ టై , మాథ్యూ వేడ్ (వైస్ కెప్టెన్), ఆడమ్ జాంపా.