దుబాయ్: Australia Women vs India Women: భారత్ ఓటమి! ఆస్ట్రేలియాతో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 9 పరుగుల తేడాతో ఓడింది.
ఈ ఓటమి వల్ల భారత్ సెమీఫైనల్స్ చేరే అవకాశాలు కష్టమైపోయాయి. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 142 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓడింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 47 బంతుల్లో 54 పరుగులతో అజేయంగా నిలిచారు. దీప్తి శర్మ 29 పరుగులు, షఫాలి వర్మ 20 పరుగులతో నిలిచారు.
ఇండియా గ్రూప్ ఏ లో 4 పాయింట్లు సాధించింది (2 గెలుపు, 2 ఓటములు). ఆస్ట్రేలియా మొత్తం 151/8 స్కోరు చేసింది, గ్రెస్ హ్యారిస్ 40 పరుగులు చేశారు.
భారత బౌలర్లు రేణుకా సింగ్, దీప్తి శర్మ 2 వికెట్లు తీశారు.