fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsనాని 'జెర్సీ' ని అభినందించిన ఆస్ట్రేలియా జర్నలిస్ట్

నాని ‘జెర్సీ’ ని అభినందించిన ఆస్ట్రేలియా జర్నలిస్ట్

Australian JournalistPraises NaniJersey

టాలీవుడ్: గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరో గా 2019 లో క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో విడుదలైన సినిమా ‘జెర్సీ’. ఎంతో మందికి ఈ సినిమా అల్ టైం ఫేవరేట్ అనడం లో సందేహం లేదు. ఎంతో ఎమోషనల్ నోట్ లో స్మూత్ గా వెల్తూ ఉంటుంది ఈ సినిమా. చూసిన ప్రతి వారికి చూసిన ప్రతీ సారి ఎమోషనల్ గా ఆకట్టుకుంటుంది ఈ మూవీ. ఈ సినిమాని షాహిద్ కపూర్ హీరో గా హిందీ లో కూడా రూపొందిస్తున్నారు. ఇపుడు ఈ సినిమా గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ మధ్యనే ఈ సినిమా చూసిన ఒక ఆస్ట్రేలియా స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఈ సినిమాని ఆకాశానికి ఎత్తింది. ఇపుడు ఈ జర్నలిస్ట్ ని తెలుగు అభిమానులు సోషల్ మీడియా లో ఆకాశానికి ఎత్తుతున్నారు.

తాను జెర్సీ సినిమా చూశానని చాలా బాగుందని ఎంతో ఎమోషనల్ కనెక్ట్ ఉందని అభిప్రాయం పడ్డారు చోలే-అమండా బెయిలీ. అందులో ఈ సినిమాలో ట్రైన్ సీన్ తన ఫెవరెట్ అని చాలా కనెక్టింగ్ గా ఉందని తన అభిప్రాయం చెప్పారు. ఈ సినిమా మేకర్స్ చాలా అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు అని నాని నటనని ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సినిమాలో అర్జున్ పాత్ర ఎంతో ఎమోషనల్ గా ఉందని తనతో నవ్వుతారు, ఏడుస్తారు అని ఈ సినిమా నాకు చాలా సంతృప్తి ని ఇచ్చిందని తెలిపారు. మామూలుగానే మనోళ్ళని వేరే దేశం వాళ్ళు పొగిడితే వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తారు. అలాంటిది ఒక రీజనల్ సినిమాని దేశం కానీ దేశం వాళ్ళు ఇలా పొగిడితే ఊరుకుంటారా, ఇంక అప్పటి నుండి ఈ జర్నలిస్ట్ ట్రెండింగ్ లో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular