హాలీవుడ్: 2009 లో విడుదలై సంచలనం సృష్టించిన సినిమా అవతార్. విడుదలైన అన్ని దేశాల్లో అన్ని ప్రాతాల్లో రికార్డులు సృష్టించింది ఈ సినిమా. ఇప్పటికి తెలుగులో ఒక డబ్బింగ్ సినిమాకి కొన్ని చోట్ల రికార్డులు ఈ సినిమా పేరుపైన్నే ఉన్నాయి. సాధారణంగా డబ్బింగ్ సినిమాలు అందులో ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలు ఒక వారం లేదా రెండు వారాలు ఆడడం గొప్ప విషయం. కానీ ఈ సినిమా ఆ టైం లో కొన్ని సెంటర్లలో యాభై రోజులు కూడా ఆడింది. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఒక కొత్తరకంగా చూపించిన సినిమా అవతార్. సినిమాకి వెళ్లిన వాళ్ళకి తమకి తెలియని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది ఈ సినిమా. టైటానిక్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి, తన అద్భుత విజన్ ఈ సినిమా. అయితే దాదాపు 5 ఏళ్ల క్రితమే ఈ సినిమాకి 5 సీక్వెల్స్ ప్రకటించారు ఈ సినిమా డైరెక్టర్. కానీ ఇప్పటివరకు ఒక్క పార్ట్ కూడా విడుదల కాలేదు. ఏ సంవత్సరం ఏ పార్ట్ విడుదల అవుతుందో ముందే తేదీ విడుదల చేసారు.
కానీ కరోనా వల్ల, షూటింగ్స్ నిలిచి పోవడం వల్ల, గ్రాఫిక్స్ వర్క్ కూడా నిలిచిపోవడం వల్ల చాలా సినిమాలతో పాటు ఈ సినిమా కూడా వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరుగుతుంది. కానీ షూటింగ్ ఇంతకముందులా లేదు. చాలా నియమ నిబంధనలకు లోబడి చెయ్యాలి. అందువలన షూటింగ్స్ చాలా ఆలస్యం అవుతున్నాయి. షూటింగ్ మాత్రమే కాకుండా ఈ సినిమాకి అతి ముఖ్యమైనది విజువల్ ఎఫెక్ట్స్. అవి అమెరికాలో చేస్తున్నప్పటికీ అక్కడ చాలా రోజులుగా కరోనా విజృంభణ ఉండడంతో ఆ పనులు కూడా ఆలస్యం అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఈ సినిమా డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఒక నోట్ విడుదల చేసారు. కరోనా సంక్షోభం ముందు వారికి అంత బాగానే ఉండి అన్నీ షెడ్యూల్ ప్రకారం జరగడం వలన మొదటి సీక్వెల్ ని డిసెంబర్ 2021 సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నాం కానీ ఇపుడు అది వీలుపడట్లేదు అని చెప్పారు. ఈ విషయంలో మొదలు నిరుత్సాహ పడేవాణ్ణి నేనే అని చెప్పారు. ఆలస్యం అయినా కానీ క్వాలిటీ మాత్రం ఎక్కడా తగ్గదు మీ ఎక్సపెక్టషన్స్ రీచ్ అవుతుంది అన్నట్టు చెప్పారు. కొత్తగా ప్రకటించిన తేదీల ప్రకారం అవతార్ పార్ట్ లు ఇలా విడుదల అవబోతున్నాయి. 2022 డిసెంబర్ 16న అవతార్-2, 2024 డిసెంబర్ 20న అవతార్-3 , 2026 డిసెంబర్ 18న అవతార్-4 , అలాగే 2028 డిసెంబర్ 22న అవతార్-5 విడుదల కానున్నాయి.