న్యూఢిల్లీ: పరిశ్రమల మనుగడకు తీవ్ర ముప్పు కలిగేలా చేసిన కరోనావైరస్ మహమ్మారి ఫలితంగా ఈ ఏడాది విమానయాన ఆదాయం దాదాపు 60 శాతం పడిపోతుందని అంతర్జాతీయ వాయు రవాణా సంఘం నవంబర్ 24, మంగళవారం రోజున తెలిపింది. “కోవిడ్ -19 సంక్షోభం వాయు రవాణా మనుగడకు ముప్పు కలిగిస్తుంది, పరిశ్రమ “2020 తో చరిత్రలో అత్యంత నష్టం మిగిల్చిన సంవత్సరంగా దిగజారిపోయే అవకాశం ఉందని ఈఆటా తెలిపింది.
విమానయాన సంస్థలు రోజుకు 1 బిలియన్ డాలర్ల ఖర్చులను తగ్గించుకుంటున్నాయి, విమానాలను గ్రౌండింగ్ చేయడం మరియు ఉద్యోగాలను తగ్గించడం వంటివి చేస్తున్నప్పటికీ, అవి ఇంకా భారీ నష్టాలను పెంచుతున్నాయి.
కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచంలోని దాదాపు అన్ని రకాల పరిశ్రమ వర్గాలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. అదే దారిలో విమానయాన రంగం కూడా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. అయితే ఈ రంగం ఇప్పట్లో ఎప్పుడు కోలుకుంటుందోననేది ఇంకా ఎవరికీ తెలియని విషయం.