టాలీవుడ్: మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ కరోనా టైం లో ‘సూపర్ మచ్చీ’ అనే సినిమాని పూర్తి చేసాడు. ఈ సినిమా ఓటీటీ లో విడుదల చేయాలా లేక థియేటర్ లోనా అనే డిస్కషన్స్ లో ఉంది. తర్వాత కళ్యాణ్ దేవ్ మరో సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ శ్రీధర్ శ్రీపాన దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఉయ్యాలా జంపాల హీరోయిన్ అవికా గోర్ నటిస్తుంది. చాలా గ్యాప్ తీస్కుని బాడీ ని ట్యూన్ చేసి ఈ సినిమా ద్వారా కం బ్యాక్ అయ్యి మల్లి హిట్స్ కొట్టాలన్న ఆశతో ఉంది అవికా గోర్. ఈ రోజు అవికా పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి అవికా ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేసారు మూవీ టీం.
ఈ వీడియో బైట్ లో అవికా ఇంట్రోడక్షన్ షాట్స్ చూపించి వర్షంలో పిల్లలతో ఆడుతున్న అవికా గోర్ ని చూపించారు. టీజర్లో విజువల్స్ చూస్తుంటే ఇదొక మంచి లవ్ స్టోరీ గా రూపొందనున్నట్టు అర్ధం అవుతుంది. గీతా ఆర్ట్స్ వారి GA2 పిక్చర్స్ బ్యానర్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీ.జి.విశ్వ ప్రసాద్ మరియు అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం లో ఈ సినిమా రూపొందుతుంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా గురించి మరి కొన్ని రోజుల్లో టైటిల్ ప్రకటన తో పాటు విడుదల తేదీ తెలియ చేయనున్నారు మేకర్స్.