లక్నో: హిందువులు ఎంతో భక్తితో కొలిచే శ్రీ రామునికి మాతృ భూమి అయిన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చేస్తున్న ఘట్టం త్వరలోనే ఆవిష్కారం కానుంది.
చాలా సంవత్సరాలు హై కోర్టులో నలిగిన రామ మందిర వివాదం గత సంవత్సరం పరిష్కారమైన సంగతి విదితమే. ఐతే ఇప్పటికే రామ మందిరం ఎలా ఉండాలి అనే డిజైన్ సిద్ధమైందని సమాచారం. కరోనా, లాక్ డౌన్ పరిస్థితుల వల్ల రామ మందిర నిర్మాణ భూమి పూజ వాయిదా పడుతూ వచ్చింది.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం భూమి పూజను జూలై 29న నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచన, ఒక వేళ ఆ తేదీన కుదరక పోతే ఆగష్టు 5న మాత్రం ఖచ్చితంగా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆగష్టు 5వ తేదీ ముహుర్తం చాలా దివ్యంగా ఉందని ఆ ముహుర్తానికైనా ఖచ్చితంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోంది.
ఇప్పటికే భూమి చదును పనులు చక చక జరుగుతున్నాయి. ఎటువంటి ఆటంకం లేకుంటే మరో నెల రోజులలోనే ఈ దివ్యమైన కార్యం కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.