ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాపట్లలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో మమేకమయ్యారు.
టీచర్స్-పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా పాఠశాల విద్యార్ధులతో కలిసి మధ్యాహ్న భోజనానికి కూర్చొని మిడ్ డే మీల్స్ పథకం ద్వారా అందిస్తున్న ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించారు.
చంద్రబాబు, లోకేశ్ విద్యార్థులతో భోజనం చేయడమే కాకుండా, ప్రతి రోజు అందించే మెనూ గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు చక్కెర పొంగలి అందిస్తున్నారా? పోషకాహార నిబంధనలకు అనుగుణంగా పథకం అమలవుతోందా? అని అడిగి మరీ పరిశీలించారు.
పాఠశాలలో పాఠకారుల మధ్య నేరుగా మమేకమై, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా, అందించబడుతున్న ఆహారంపై తమ అభిప్రాయాలను కూడా విద్యార్థుల నుండి పొందారు.
సాధారణ వ్యక్తులుగా పిల్లలతో కలిసి కింద కూర్చొని భోజనం చేసిన చంద్రబాబు, లోకేశ్ లపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
గత ప్రభుత్వంలో ఇలాంటి చర్యలు కనిపించలేదని, పిల్లలతో ఇలా కలిసి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం గతంలో కనీసం ఒకసారి కూడా జరగలేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
తన భవిష్యత్తు ప్రణాళికలో ఇంటర్ విద్యార్థులకు కూడా మిడ్ డే మీల్స్ అందించే విధానాన్ని తీసుకురావాలని లోకేశ్ యోచిస్తున్నారని తెలిసింది.