fbpx
Sunday, November 24, 2024
HomeMovie Newsదేశ ఆర్ధిక నేరస్థులపై వెబ్ సిరీస్

దేశ ఆర్ధిక నేరస్థులపై వెబ్ సిరీస్

BadBoyBillionaires StreamingOn Netflix

ముంబై: ‘బాడ్ బాయ్ బిల్లియనీర్స్’ అని ఒక వెబ్ సిరీస్ని ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్ వారు రూపొందించారు. మన దేశంలో అతి పెద్ద ఆర్ధిక నేరాలకు పాల్పడిన వ్యాపారవేత్తల జీవితాల ఆదారంగా రూపొందించిన సిరీస్ గ ‘బాడ్ బాయ్ బిల్లియనీర్స్ – ఇండియా’ చర్చల్లో నిలిచింది. ఈ వెబ్ సిరీస్ లో సత్యం రామలింగరాజు, నిరావ్ మోడీ, విజయ్ మాల్యా, సహారా సుబ్రతో రాయ్ ల కథలను వాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేసిన విధానాల్ని చెప్పే ప్రయత్నం చేసారు.

వెబ్ సిరీస్ పై విజయ్ మాల్యా తనయుడు సిద్దార్థ మాల్యా స్పందించాడు. ఈ ప్రభుత్వం తన తండ్రిని బలిపశువును చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వెబ్ సిరీస్ పై సహారా గ్రూప్ వాళ్ళు కూడా గట్టిగానే విమర్శలు చేసారు. ఇప్పటికే స్ట్రీమింగ్ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ మరియు వెబ్ సిరీస్ మేకర్స్ నటీనటులు మరియు సాంకేతిక నిపుణులపై క్రిమినల్ కేసులు పెట్టినట్లుగా సహార గ్రూప్ ప్రకటించింది.

ఈ వెబ్ సిరీస్ తమ ప్రతిష్ట ని దెబ్బ తీసేలా ఉందని ఈ వెబ్ సిరీస్ విడుదల ని నిలిపివేయాలంటూ సత్యం రామలింగరాజు హైదరాబాద్ లో కోర్ట్ ని ఆశ్రయించాడు. అయితే ముందుగానే నెట్ ఫ్లిక్ ఫారు సిరీస్ లో ఒక ఎపిసోడ్ ని తప్పించి విడుదల చేసారు. ఈ ఎపిసోడ్ లో ఉండే కంటెంట్ రామలింగరాజు దా లేక మరేదైనా ఉండ అన్న విషయం పై స్పష్టత ఏమీ లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular