fbpx
Saturday, October 19, 2024
HomeMovie Newsబాహుబలి-3 పై క్లారిటీ ఎప్పుడొస్తుంది?

బాహుబలి-3 పై క్లారిటీ ఎప్పుడొస్తుంది?

BAHUBALI-3-CLARITY-AWAITED-FROM-RAJAMOULI
BAHUBALI-3-CLARITY-AWAITED-FROM-RAJAMOULI

మూవీడెస్క్: బాహుబలి-3 పై క్లారిటీ! బాహుబలి సిరీస్ భారతీయ సినీ చరిత్రలో ఒక సంచలనం సృష్టించింది.

ప్రభాస్, అనుష్క ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఈ ఫ్రాంచైజీ రెండు భాగాలు వరల్డ్ వైడ్ గా రికార్డులు సృష్టించాయి.

అప్పటి నుంచి బాహుబలి-3 పై ఆసక్తి కొనసాగుతూనే ఉంది. రాజమౌళి కూడా మూడో భాగం గురించి కొన్ని సందర్భాల్లో సూచనలు చేశాడు, కానీ స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా కోలీవుడ్ నిర్మాత కేఈ జ్ఞానవేల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో బాహుబలి-3 పై చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చలకు దారితీశాయి.

ఆయన ప్రకటన ప్రకారం బాహుబలి-3 కోసం డిస్కషన్లు జరుగుతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. అయితే, నెటిజన్లు ఈ వార్తలపై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ SSMB 29 నిర్మాణంపై ఫోకస్ పెట్టినందున, బాహుబలి-3 ప్రారంభం త్వరగా జరుగుతుందని అనుకోవడం కష్టమే.

ఈ ప్రాజెక్ట్ పూర్తి అయినప్పటికీ, తదుపరి బాహుబలి-3 స్టార్ట్ చేస్తే కూడా విడుదల 2030 తర్వాతే సాధ్యమని చెబుతున్నారు.

ఈ గ్యాప్ కారణంగా ప్రేక్షకులు మూడో పార్ట్ పై ఆసక్తి చూపిస్తారా అన్న అనుమానాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular