మూవీడెస్క్: బాహుబలి విలన్ గా ఫస్ట్ ఛాయిస్ రానా కాదంట! దర్శక ధీరుడు రాజమౌళి సినిమా తీస్తే అది విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ముఖ్యంగా “బాహుబలి” సిరీస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇంకా అభిమానుల్లో చర్చలకు తెరలేపుతూనే ఉంటాయి. తాజాగా తెలిసిన ఒక ఇన్సైడ్ స్టోరీ ఇప్పుడు తెగ హాట్ టాపిక్ అవుతోంది.
“బాహుబలి” సినిమాలో ప్రతినాయకుడు భళ్ళాలదేవుడి పాత్ర ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ పాత్రకు రానా దగ్గుబాటి అద్భుతమైన న్యాయం చేయగా, దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
అయితే, మొదట ఈ పాత్ర కోసం రాజమౌళి హాలీవుడ్ నటుడు జేసన్ మామోవా పేరు పరిశీలించారని ఇప్పుడు తెలిసింది.
మామోవా ల్ “ఆక్వామెన్” సిరీస్‌తో క్రేజ్ అందుకున్నాడు, ఇక ఆయనకు ఉన్న బాడీ కటౌట్ ప్రభాస్‌కు పోటీగా సరిపోతుందని భావించిన రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ ఈ ఆలోచనలోకి వచ్చారట.
కానీ, చివరికి రానా దగ్గుబాటి పేరు పైనే స్థిరపడ్డారు. రానా కూడా ఈ పాత్ర గురించి తెలుసుకున్న వెంటనే, దీనిపై ఆసక్తి చూపించి, పాత్రని అంగీకరించారని సమాచారం.
ఈ నిర్ణయం అనుకూలించిందని చెప్పవచ్చు, ఎందుకంటే రానా ప్రదర్శన భళ్ళాలదేవుడి పాత్రకు ప్రత్యేకమైన మెరుగులను అద్దింది.
ఇప్పుడు, ఈ విషయం “మోడ్రన్ మాస్టర్స్” డాక్యుమెంటరీలో బయటపడటంతో, ఇది అభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.
ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి తన ప్రస్థానంలో జరిగిన అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీకి భారీ ఆదరణ లభిస్తోంది.