ఇప్పుడు అందరూ కరోనాతో సహజీవనం ప్రారంభించారు. తగు జాగ్రత్తలు తీస్కొని మాస్కులు, శానిటైజర్స్ వాడుతూ దైనందిన జీవితం గడుపుతున్నారు. మరి ఒకవేళ మాహిష్మతి లో కూడా కరోనా పరిస్థితులు ఏర్పడితే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన ఒక VFX స్టూడియో వాళ్ళకి వచ్చింది. వచ్చిన ఆలోచనే తడవుగా వెంటనే ఒక వీడియో రూపొందించి విడుదల చేసారు. మాస్కుల వాడకం పైన ఒక్కొక్కరు ఒక్కో రూపం లో ప్రచారం చేస్తున్నా కూడా ఈ వీడియో అందులో ప్రత్యేకంగా కనిపించింది. దాదాపు 10 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో కి రాజమౌళి ప్రశంసలు కూడా దక్కాయి.
బాహుబలి సినిమా క్లైమాక్స్ లో రానా, ప్రభాస్ మధ్య నువ్వా నేనా అని చూసుకునే ఒక సీన్ తీస్కొని అందులో వాళ్ళ మొహాలకి మాస్కులు జోడించి అచ్చం రాజమౌళి మాస్కు పెట్టి షూటింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా రూపొందించారు వీడియో. చివరలో మాహిష్మతి లో కూడా మాస్కులు తప్పనిసరి, మీరు కూడా వాడండి అని ఒక మెసేజ్ ఇచ్చారు మేకర్స్. చాల అద్భుతంగా రూపొందించిన ఈ వీడియో సోషల్ మీడియా లో ట్రేండింగ్ లో ఉంది.