టోక్యో: టోక్యో లో జరుగుతున్న ఒలంపిక్స్ లో భారత్ కు మరో పతకం లభించింది. భారత్ రెజ్లర్ అయిన భజరం పునియా కజకిస్తాన్ రెజ్లర్ నియోజ్ బెకోవ్ పై 8-0 తేడాతో గెలిచి కాంస్య పతకాన్ని సాధించాడు.
ఇవాళ జరిగిన పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ కాంస్య పతక పోటీలో రెజ్లర్ బజరంగ్ పునియా కజకిస్తాన్‌కు చెందిన డౌలెట్ నియాజ్‌బెకోవ్‌తో తలపడ్డాడు. పునియా సెమీ ఫైనల్ పోరులో ఇరాన్ ఆటగాడు హజీ అలీయేవ్ చేతిలో ఓడిపోయాడు.
కాగా ఇవాళ జరిగిన కాంస్య పోరులో మొదటి నుండి ఆధిపత్యం చెలాయించిన భజరంగ్ పునియా చివరకు 8-0 తేడాతో నియోజ్ పై గెలిచి చరిత్ర సృష్టించాడు.