fbpx
Thursday, December 12, 2024
HomeTop Movie Newsరిలీజైన బాలకృష్ణ అఖండ సినిమా టైటిల్ సాంగ్!

రిలీజైన బాలకృష్ణ అఖండ సినిమా టైటిల్ సాంగ్!

BALAKRISHNA-AKHANDA-TITLESONG-RELEASED-AND-TRENDING-IN-YOUTUBE

మూవీడెస్క్: బోయపాటి శ్రీను మరియు బాలకృష్ణ కాంబినేషన్‌లో త్వరలో రానున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘అఖండ’. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌ మరియు టీజర్ల కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇటీవలే తాజాగా ఈ చిత్ర బృందం నుండి అఖండ టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌ అయింది.

ఈ టైటిల్ సాంగ్ లో శంకర్ మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్ మరియు శివమ్ మహదేవన్ ఆలపించగా ఆ పాటలోని‌ భారీ విజువల్స్‌తో చూసిన వారికి గూస్‌బంప్స్‌ తెప్పిస్తోంది. విడుదలైన కాసేపట్లోనే ఈ టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. బాలకృష్ణ నటించిన సింహా,లెజెండ్‌ వంటి బెగ్గెస్ట్‌ హిట్స్‌ తర్వాత బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఈ చిత్రం ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే ఈ చిత్రంలో దిగ్గజ నటులైన జగపతిబాబు, శ్రీకాంత్‌ మరియు పూర్ణ లు చాలా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి ఎస్.ఎస్. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular