హరీష్ శంకర్‌కు మళ్లీ ట్రాక్‌లోకి వచ్చే టైమ్ వచ్చిందా? ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ తర్వాత కెరీర్‌కు మళ్లీ స్పీడ్ తేవాలంటే, మాస్ అండ అవసరం. ఆ మాస్ అండను ఎవరు ఇస్తారు అంటే.. ఖచ్చితంగా బాలకృష్ణే! ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ స్టామినా, మాస్ పుల్స్, థియేటర్ కలెక్షన్ల ఫిక్స్ అన్నీ బాలయ్యదే. ఇదే లైన్‌లో ఇప్పుడు హరీష్ – బాలయ్య కాంబోపై టాక్ ఊపందుకుంది.
పవన్‌తో చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ముందుకెళ్లక, మిస్టర్ బచ్చన్ వెనుకపడ్డ వేళ.. హరీష్‌కు బాలయ్య సరిగ్గా మెడిసిన్‌గా మారబోతున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బాబీ లాంటి యువ డైరెక్టర్లు బాలయ్యతో మాస్ హిట్‌లను స్కోర్ చేయగా, ఇప్పుడు హరీష్ అదే మార్గాన్ని అనుసరించనున్నట్టు ఫిలింనగర్ లో బలంగా వినిపిస్తోంది.
ఇక ఈ క్రేజీ కాంబినేషన్‌కు బ్యాక్ బోన్‌గా నిలవబోతున్నది కేవీఎన్ ప్రొడక్షన్స్. బాలయ్య ప్రస్తుతం ‘అఖండ 2’ పనుల్లో ఉన్నప్పటికీ, ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యే సరికి హరీష్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం. స్క్రిప్ట్ రెడీ అవుతుండగా, డేట్స్ క్లియర్ అయిన వెంటనే అధికారిక ప్రకటన రావొచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌తో హరీష్ శంకర్ మళ్లీ తన మాస్ డైరెక్టర్ ఇమేజ్‌ను నిలబెట్టుకునే ఛాన్స్ ఉండగా, బాలయ్య ఫ్యాన్స్‌కి ఇది మరో పుల్ మాస్ ట్రీట్.