మూవీడెస్క్: నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ (తారక్) మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయన్న ప్రశ్న సినీ వర్గాల్లో ఎప్పటికప్పుడు చర్చనీయాంశమే.
ఇటీవల బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షోలో తారక్ (Tarak) పేరు ప్రస్తావించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
లక్కీ భాస్కర్, డాకు మహారాజ్ టీమ్ షోల సమయంలో బాలయ్య అజ్ఞాతవాసి, అల వైకుంఠపురములో చిత్రాల గురించి మాట్లాడినప్పటికీ, తారక్ పేరు ప్రస్తావన లేదు.
ఇదే విషయంపై రూమర్లు ఊపందుకోవడంతో, బాలయ్య తారక్‌ను కావాలనే ఉద్దేశపూర్వకంగా మరిచారని అనుకుంటున్నారు.
అలాగే, బాబీ జై లవకుశ మూవీ గురించి కూడా ఎలాంటి కామెంట్స్ చేయకపోవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.
ఎన్టీఆర్ ప్రస్తావన లేకపోవడం వెనుక ఎలాంటి కారణాలున్నాయోనని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, నిర్మాత నాగవంశీ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. “షో సమయంలో లైవ్‌లో కాకపోయినా, ఆఫ్ ది రికార్డ్‌గా బాలయ్య ఎన్టీఆర్ గురించి ఆసక్తికరంగా మాట్లాడారు.
జూనియర్ ఎన్టీఆర్ ఓ స్పెషల్ క్యారెక్టర్ చేస్తే బాగా సూటవుతుందని బాలయ్య చెప్పారని” అన్నారు.
నాగవంశీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, బాలయ్య, తారక్ భవిష్యత్ ప్రాజెక్టుల్లో కలిసి పనిచేస్తే అదుర్స్ అనుకుంటున్నారు ఫ్యాన్స్.