మూవీడెస్క్: నందమూరి బాలకృష్ణ అఖండ 2 తన కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టడానికి సిద్ధమవుతున్నాడు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ చిత్రం బాలయ్య కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య చేసిన డ్యూయల్ రోల్, ముఖ్యంగా అఘోర పాత్ర ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
ఇప్పుడు, ఇదే కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది -అదే అఖండ 2. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతోందని టాక్.
బాలయ్య ఈ ప్రాజెక్ట్ కోసం 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే వార్తలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారాయి.
గతంలో భగవంత్ కేసరి సినిమాకు 18 కోట్లను, ఇప్పుడు NBK109కి 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న బాలయ్య, ఇప్పుడు అఖండ 2 కోసం మరింత రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇది బాలకృష్ణ తన కెరీర్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ప్రాజెక్ట్ కావడం విశేషం. టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ 10 అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్ లిస్ట్‌లో బాలయ్య చోటు సంపాదించాడని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గతంలో నాని, రవితేజ వంటి స్టార్ హీరోలు ఈ లిస్ట్‌లో ముందుండేవారు, కానీ బాలయ్య వరుస సక్సెస్‌లతో ఈ స్థాయికి చేరుకోవడం అతని క్రేజ్‌ను సూచిస్తోంది.