fbpx
Tuesday, April 22, 2025
HomeMovie News'అఖండ' గా రానున్న బోయపాటి బాలయ్య సినిమా

‘అఖండ’ గా రానున్న బోయపాటి బాలయ్య సినిమా

BalakrishnaBoyapati Akhanda TitleAnnouncement

టాలీవుడ్: టాలీవుడ్ టాప్ హీరో బాలకృష్ణ వరుసగా ప్లాపులు ఉన్న సమయంలో ‘సింహా’ లాంటి సినిమా ఇచ్చి బాల కృష్ణ ని మళ్ళీ టాప్ పొజిషన్ లో నిలబెట్టాడు బోయపాటి శ్రీనివాస్. ఆ తర్వాత ‘లెజెండ్’ అనే మరో బ్లాక్ బస్టర్ ఇచ్చి వీళ్ళ కాంబినేషన్ సూపర్ హిట్ అని ప్రూవ్ చేసారు. మధ్యలో బాల కృష్ణ కొన్ని సినిమాలు చేసినా కానీ ఈ కాంబినేషన్ లో వచ్చిన రెస్పాన్స్ వేరే సినిమాలకి రాలేదు. ప్రస్తుతం వీళ్లిద్దరు కలిసి హ్యాట్రిక్ కొట్టడానికి మూడవసారి రెడీ అయ్యారు. ఇన్ని రోజులు BB3 (బోయపాటి బాలయ్య 3 ) అని పిలవబడిన ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ఈ సినిమా టీజర్ కూడా ఈ రోజు విడుదల చేసింది సినిమా టీం.

సినిమాకి ‘అఖండ’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టి టైటిల్ తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు బోయపాటి. విడుదల చేసిన టీజర్ లో కూడా బాలకృష్ణ ఒక పవర్ ఫుల్ అఘోరా లాంటి పాత్రలో మెరిశాడు. ఇలాంటి పాత్రలో బాల కృష్ణ పవర్ ఫుల్ అండ్ ఇంటెన్స్ డైలాగ్స్ చూసాక వీళ్ళు కలిసి మరో సారి బ్లాక్ బస్టర్ ఇవ్వనున్నట్టు సంకేతాలు ఇచ్చారు. వీటితో పాటు ఈ సినిమాకి థమన్ ఇవ్వనున్న సంగీతం మరో ప్లస్ అవనుంది. సినిమా టీజర్ లో వినిపించిన మ్యూజిక్ సినిమాకి తగ్గట్టు హై స్టాండర్డ్స్ లో ఉంది. ‘కాలుదువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’ అని బాలయ్య చెప్పే డైలాగ్ లు సింహా లో ‘బురద జాతి’, లెజెండ్ లో ‘జింక’ డైలాగులని గుర్తు చేస్తాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మే నెలలో ఈ సినిమాని విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Akhanda | #BB3 Title Roar | Nandamuri Balakrishna | Boyapati Srinu | Thaman S | Dwaraka Creations

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular