మూవీడెస్క్: మోక్షజ్ఞ తెరంగేట్రంపై ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ ఎప్పుడు జరుగుతుందా అని నందమూరి అభిమానులు ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే వచ్చిన అధికారిక ప్రకటనతో, మోక్షజ్ఞను ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని క్లారిటీ వచ్చింది.
ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.
తాజాగా ఈ చిత్రంలో మోక్షజ్ఞ తల్లిగా సీనియర్ హీరోయిన్ శోభన నటించబోతున్నారనే వార్తలు లీక్ అయ్యాయి.
శోభన గతంలో బాలకృష్ణతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.
‘నారి నారి నడుమ మురారి’, ‘మువ్వ గోపాలుడు’ వంటి సినిమాల్లో ఆమె సత్తా చాటారు.
తాజాగా ‘కల్కి 2898 A.D’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన శోభన, మోక్షజ్ఞ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
ప్రశాంత్ వర్మ తెరకెక్కించబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ కావడంతో సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది.