fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsఅఖండ - బాలయ్య స్పెషల్ పోస్టర్

అఖండ – బాలయ్య స్పెషల్ పోస్టర్

BalayyaNewLook From AkhandaMovie

టాలీవుడ్: నందమూరి బాలకృష్ణ, అభిమానులు ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటారు. రేపు బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న ‘అఖండ’ సినిమా నుండి బాలయ్య స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి విషెస్ తెలియచేసింది సినిమా టీం. ఇదివరకు ఈ సినిమా టీజర్ విడుదల చేసి అంచనాలు పెంచారు. ఆ టీజర్ లో పూర్తిగా అఘోరా లుక్ లో మెప్పించాడు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఈ సినిమాలో బాలకృష్ణ నటిస్తున్న రెండవ పాత్ర కి సంబందించిన లుక్ ని విడుదల చేసింది సినిమా టీమ్.

ఈ కొత్త లుక్ లో నవ్వుకుంటూ, సెలెబ్రేషన్ మూడ్ లో నడుచుకుంటూ వస్తున్న బాలకృష్ణ ని చూడవచ్చు. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటులు జగపతి బాబు, శ్రీకాంత్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. బోయపాటి , బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ హ్యాట్రిక్ మూవీ పైన అభిమానుల అంచనాలు బాగానే ఉన్నాయి. ద్వారా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మొదటి సారి థమన్ బాలకృష్ణ తో కలిసి పని చేయనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular