అమరావతి: జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ‘సిద్ధం’ అయినట్లు తెలుస్తోంది. జనసేనలోకి చేరికపై ఆయన సీరియస్ గా ఆలోచిస్తున్నారని, ఈ దసరా పండుగనాడు ఈ విషయంలో సంచలన ప్రకటన చేస్తారని ఆయన అనుచరులు కొందరు బాహాటంగానే మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. పార్టీ మార్పుపై జరుగుతున్న ఈ ప్రచారం స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
జనసేనలోకి బాలినేని జంప్?
వైసీపీ అధినేత జగన్‌కు బంధువుగా, అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న బాలినేని, ఈసారి కండువా మార్చడం ఖాయమని సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా జనసేన నేతలతో ఆయన సీక్రెట్ మీటింగ్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరులతో ఈ విషయంలో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే, పార్టీ మార్పుపై కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని కూడా ప్రచారం సాగుతోంది.
అసంతృప్తి, అంతర్గత విభేదాలు
కొంతకాలంగా వైసీపీలో బాలినేనికి విభేదాలు తలెత్తాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి పొందిన బాలినేనిని, రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గం నుంచి తప్పించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అలాగే, ఎన్నికల సమయంలో ఆయన సూచించిన వారికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం, జిల్లాలోని మరో కీలక నేత వైవీ సుబ్బారెడ్డితో విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో, యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌కు జిల్లా వైసీపీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది, దీనిపై కూడా బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం.
పవన్ కల్యాణ్‌తో డైరెక్ట్ టాక్స్?
బాలినేనిని తీసుకోవడంపై జనసేన, టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ, బాలినేని మాత్రం డైరెక్ట్‌గా పవన్ కల్యాణ్‌తోనే మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ పరిణామాలు చూస్తే, జగన్‌కు ఇది పెద్ద దెబ్బ అవుతుందా? జనసేనలోకి బాలినేని ప్రవేశం సరికొత్త సమీకరణాలను తెరమీదకు తెస్తుందా? అనేది ఆసక్తిగా మారింది.
దసరాకు సంచలన ప్రకటన?
ప్రస్తుతం అందరి దృష్టీ బాలినేనిపై నెలకొంది. ఈ దసరా పండుగనాడు జనసేనలోకి ఆయన జంప్ ఉంటుందా లేదా? రాజకీయాలలో తన ఉనికిని కాపాడుకోవడానికి ఆయన తీసుకోబోయే నిర్ణయం రాజకీయ వాతావరణంలో ప్రకంపనలు రేపే అవకాశం కనిపిస్తోంది.