టాలీవుడ్ : కరోనా వచ్చిన తర్వాత, లొక్డౌన్ వల్ల థియేటర్స్ అన్ని మూసివేయడం వల్ల ఇప్పటికి చాలా సినిమాలు ఓటీటీల్లో విడుదల అయ్యాయి. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు లో థియేటర్స్ కి జనాలు వస్తారో రారో అన్న అనుమానాలు చాలా మందికి రేకెత్తుతున్నాయి. వీటిపై చాలా డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. దీనిపై నిర్మాత బండ్ల గణేష్ ఒక అద్భుతమైన లాజిక్ చెప్పాడు. బండ్ల గణేష్ చెప్పే మాటలు చాలా వరకు కామెడీ అని పించినా ఇది మాత్రం బాగుంది. అసలు జనాలు థియేటర్స్ కి రారు అనే విషయాన్ని కొట్టి పారేశారు. మల్లి థియేటర్స్ మొదలైతే ఇదివరట్లానే కళకళలాడుతాయి అని చెప్పారు.
ఒక ఇంటర్వ్యూ లో తాను ఇలా చెప్పారు. ‘ నేను ఒక సినిమా నిర్మించి అది విడుదలకి సిద్ధంగా ఉంటె తప్పకుండ ఓటీటీ లో విడుదల చేయను అని అన్నారు. ఓటీటీల గురించి తనకి తెలియదని థియేటర్ లకే ఆదరణ ఎక్కువ ఉంటుందని చెప్పారు. ఇలా చెప్తూ మన ఇంట్లో దేవుడు ఉన్నా కూడా గుడికి ఎలా వెళ్తామో ఎన్ని ఓటీటీలు వచ్చినా జనాలు థియేటర్స్ కి తప్పకుండా వస్తారు అని చెప్పాడు. ఇంట్లో ప్రతి రోజు దేవుళ్లకు దండం పెట్టుకుంటున్నాం కదా అని గుడికి వెళ్లడం మానేస్తామా. భక్తి ఉన్న వారు ఇంట్లో పూజించినా ఖచ్చితంగా గుడికి కూడా వెళ్తారు. అలాగే సినిమాలపై ఆసక్తి ఉన్న వారు ఖచ్చితంగా ఓటీటీలో చూసినా థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటారంటూ ఇంటర్వ్యూ లో చెప్పారు. ఇన్ని చెప్తున్నాడు కానీ తన సినిమా విడుదలకి దగ్గర ఉంటే, మంచి డీల్ వస్తే ఓటీటీ కి అమ్ముకుంటాడు అని సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు విడుదల చేసారు అని ఎవరైనా అడిగితే ‘ఫ్లో లో వంద చెప్తాం అవన్నీ చేస్తామ ఏంటి ‘ అని సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ డైలాగ్ చెప్తాడని ట్రోల్ చేసారు.
OTTS unte theatres ki evadu radu. andhuke Ott lo release cheyadam ledu, daniki devudi dialogue endhuk le.