హూస్టన్: భారత దేశ సంతతికి చెందిన తెలుగు మహిళ బండ్ల శిరీష ఈ రోజు అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమైంది. ఈ రోజు మొదలయ్యే ఈ అంతరిక్ష యాత్ర విజయవంతమైతే ఈ ఘనతను సాధించిన మూడవ భారతీయ సంతతి మహిళగా బండ్ల శిరీష నిలుస్తుంది.
కాగా మరికొద్ది సేపట్లో వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ షిప్ ప్రయోగం మొదలవనుంది. క్రితంలో కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ స్పేస్‌లోని ప్రయాణించిహ్న భారత సంతతి మహిళలు. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ షిప్‌లో ఆ సంస్థ అధిపతి అయిన రిచర్బ్ బ్రాన్సన్‌తో కలిపి ఐదుగురు సభ్యులతో కలిసి శిరీష అంతరిక్ష ప్రయాణం చేయనుంది.
ఈ స్పేస్ షిప్ ప్రయోగం 90 నిమిషాల పాటు జరగనుంది. ఈ షిప్‌లో భాగస్వామి కావడం తనకెంతో గౌరవకారణమని శిరీష ట్వీట్ లో తెలిపారు. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్రకు సంబంధించిన లైవ్‌ను యూట్యూబ్‌లో షేర్ చేసింది.