టాలీవుడ్: 2016 సంవత్సరంలో సంక్రాంతి కి నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా విడుదలై నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకి ప్రీక్వెల్ గా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలోని ‘బంగార్రాజు’ పాత్రకి సంబందించిన కథతో మరో సినిమా రాబోతున్నట్టు చాలా సంవత్సరాలుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఈ మధ్యనే ఈ సినిమాని మొదలు పెట్టారు. ఈ రోజు ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో నాగార్జున తో పాటు నాగ చైతన్య కూడా నటించనున్నాడు. ‘మనం’ తర్వాత మరో సారి అక్కినేని మల్టీ స్టారర్ గా ఈ సినిమా రూపొందుతుంది.
సినిమా షూటింగ్ మొదలైనట్టు ప్రకటిస్తూ రెండు బుల్లెట్స్ ని పెట్టి బుల్లెట్స్ ని మల్లె పూల జడ తగిలించారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో నాగార్జున బులెట్ ని చూపించి, లేటెస్ట్ బులెట్ వెర్షన్ కి నాగ చైతన్య పేరు వచ్చేలా ‘ANC ‘ అనే నెంబర్ వచ్చేలా ప్రెసెంట్ చేసారు. ‘బంగార్రాజు’ అనే టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాని ‘సోగ్గాళ్ళ షూటింగ్ బిగిన్స్’ అంటూ ప్రకటించారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాని డైరెక్ట్ చేసిన కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి జీ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. సోగ్గాడే లో నటించిన రమ్యకృష్ణ తో పాటు ఉప్పెన నటి కృతి శెట్టి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. సోగ్గాడే కి సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు. ఒక సెలెబ్రేషన్ లాగ రూపొందిన సోగ్గాడే లానే ఈ సినిమా కూడా రూపొందించనున్నారు.