దుబాయ్: Bangladesh Women vs West Indies Women మ్యాచ్ లో వెస్టిండీస్ గెలుపు సాధించంది. వెస్టిండీస్ ఆఫ్-స్పిన్నర్ కరిష్మా రామ్‌హరాక్ అద్భుతమైన బౌలింగ్‌తో నాలుగు వికెట్లు సాధించి, బంగ్లాదేశ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు.
షార్జాలో జరిగిన మహిళల టి20 ప్రపంచ కప్ (Women T20 World Cup) మ్యాచ్‌లో రామ్‌హరాక్ తన నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశారు.
అయితే, ఈ బౌలింగ్ కారణంగా బంగ్లాదేశ్ 103/8 స్కోర్‌కే పరిమితమైంది. వెస్టిండీస్ జట్టు లక్ష్యాన్ని 43 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.
కెప్టెన్ హేలీ మ్యాథ్యూస్ (34) మరియు స్టెఫానీ టేలర్ (27 రిటైర్డ్ హర్ట్) మొదటి వికెట్‌కు 52 పరుగులు జోడించారు.
తర్వాత డియాండ్రా డాటిన్ కేవలం 7 బంతుల్లో 19 పరుగులు చేసి జట్టుకు విజయం సాధించారు.