సీనియర్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన ‘బాపు’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా మరో బలగం తరహాలో హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్, తండ్రి-కొడుకుల సెంటిమెంట్ చుట్టూ నడిచే కథ అయినప్పటికీ, బలమైన ఎమోషన్స్ లేకపోవడం సినిమాకి ప్రధాన లోపంగా మారింది.
ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి బ్రహ్మాజీ తన వ్యక్తిగత పరిచయాలను వాడి, పలు ప్రమోషన్ ఈవెంట్లను నిర్వహించాడు. అయితే ఈ ప్రచారం సినిమా ఫలితంపై పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రేమియర్ షోలు ద్వారా పాజిటివ్ టాక్ తీసుకురావాలని ప్రయత్నించినప్పటికీ, వీకెండ్ కలెక్షన్లు కూడా తక్కువగా నమోదయ్యాయి.
బజ్ లేకపోవడంతో చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అయ్యాయి. కొన్ని థియేటర్లలో పది, పదిహేను మంది మాత్రమే హాజరయ్యారు. ఇవాళ నుంచి కలెక్షన్లు మరింత తగ్గే అవకాశం ఉంది.
ఈ ఫలితంతో సినిమా కేవలం ఎమోషన్, సెంటిమెంట్ పై ఆధారపడితే ప్రేక్షకులు ఆకర్షితులు కావడం కష్టం అని మరోసారి స్పష్టమైంది. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలంటే, కథలో కొత్తదనం, ప్రామాణికత ఉండాలి.