fbpx
Thursday, April 24, 2025
HomeMovie News'బట్టల రామస్వామి బయో పిక్కు' ట్రైలర్

‘బట్టల రామస్వామి బయో పిక్కు’ ట్రైలర్

BattalaRamaSwamyBiopikku Trailer Released

టాలీవుడ్: కొంచెం అడల్ట్ కంటెంట్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉండేట్టు చూసుకుంటూ సక్సెస్ కొడుతున్నాయి కొన్ని చిన్న సినిమాలు.అలాంటి కాన్సెప్ట్ తోనే ‘బట్టల రామస్వామి బయో పిక్కు’ అనే ఒక సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ఒక వూర్లో బండి మీద బట్టలు అమ్ముకునే ఒక వ్యక్తి కథ ఈ సినిమా అని అర్ధం అవుతుంది. ఆ వ్యక్తికి పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన తర్వాత తన భార్య కోరిక మేరకి తన చెల్లిని పెళ్లి చేసుకుంటాడు. ఒక చెల్లి అనుకుంటే కొద్దీ రోజుల తర్వాత మరో చెల్లిని కూడా పెళ్లి చేసుకుంటాడు. ఇలా ముగ్గురు భార్యలతో రామస్వామి పడే బాధలు, సవతులుగా మారిన అక్కా చెల్లెళ్ళ పోరుని కామెడీ గా చూపించే ప్రయత్నం చేసారు.

అడల్ట్ కంటెంట్ తో పాటు, పల్లెటూళ్లలో ఉండే పాత్రల స్వభావాలు, నేటివిటీ తో కూడుకున్న ఎంటర్టైన్మెంట్, ఫామిలీ గొడవల్లో ఉండే ఎంటర్టైన్మెంట్ ని బేస్ చేసుకుని ఈ సినిమాని రూపొందించారు. అందరూ దాదాపు కొత్త వాళ్ళతోనే ఈ సినిమా రూపొందినట్టు అర్ధం అవుతుంది. ఈ సినిమాకి సంగీతం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – రామ్ నారాయణ్ అనే ఫిలిం మేకర్ అందించారు . వీ.రామ కృష్ణ మరియు సతీష్ కుమార్ అనే కొత్త నిర్మాతలు ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాని జీ వారి zee5 ఓటీటీ లో మే 14 న విడుదల చేయనున్నారు.

Battala Ramaswamy Biopikku | Official Trailer | Premieres 14th May 2021 on ZEE5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular