న్యూఢిల్లీ: అక్టోబర్ లో యూఏఈ లో జరగబోయే క్రికెట్ టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. టీమిండియా ప్రస్తుతం లండన్ లో టెస్ట్ క్రికెట్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో బీసీసీఐ ప్రపంచ కప్ కోసం తమ జట్టును ప్రకటించింది.
భారత్ వైపు ఆడబోయే టీ20 జట్టు సభ్యులు వీరే:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్-కెప్టెన్), కే ఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇసాన్ కిషన్ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బూమ్రా, భువనేశ్వర్ మరియు మహమ్మద్ షమీ.
స్టాండ్ బై సభ్యులు: శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ ఉన్నారు.
అయితే ఈ భారత జట్టుకు మెంటర్ గా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింఘ్ ధొనీ వ్యవహరించనున్నారు.