fbpx
Saturday, October 26, 2024
HomeBig Storyఆస్ట్రేలియా టూర్ కు భారత జట్టు ప్రకటన!

ఆస్ట్రేలియా టూర్ కు భారత జట్టు ప్రకటన!

BCCI-ANNOUNCES-INDIAN-TEAM-FOR-AUSTRALIA-TOUR
BCCI-ANNOUNCES-INDIAN-TEAM-FOR-AUSTRALIA-TOUR

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా టూర్ (Australia tour of India) లో భాగంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టును బీసీసీఐ శుక్రవారం రాత్రి ప్రకటించింది.

నవంబర్ 22న ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ జట్టులో జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

గాయపడిన సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ జట్టులో లేడు. అతని స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాకు మొదటిసారి టెస్ట్ జట్టులో అవకాశం దక్కింది.

అలాగే ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డికి కూడా జట్టులో చోటు లభించింది.

డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న అభిమన్యు ఈశ్వరన్‌ను కూడా జట్టుకు ఎంపిక చేశారు.

రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ ఈ జట్టులో వికెట్ కీపర్లుగా ఉన్నారు.

యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్‌మెన్‌ టాప్ ఆర్డర్‌లో కీలకంగా నిలుస్తారు.

మిడిల్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ కూడా ఉన్నారు. బుమ్రా, హర్షిత్ రాణాతో పాటు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించనున్నారు.

జట్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ముగ్గురు స్పిన్ ఆల్‌రౌండర్లుగా ఉన్నారు.

కాగా, ఎడమ చేతి స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు.

మరోవైపు కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్ తర్వాత క్రానిక్ లెఫ్ట్ గ్రోయిన్ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం కోసం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు పంపనున్నట్టు తెలిపారు.

పేసర్లుగా ముగ్గురు రిజర్వ్ ప్లేయర్లను ఎంపిక చేశారు – ముఖేష్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్.

ఇండియా న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ అనంతరం నవంబర్ 22న ప్రారంభమయ్యే ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాల్గొననుంది.

Squad for the Border-Gavaskar Trophy: 

Rohit Sharma (C), Jasprit Bumrah (VC), Virat Kohli, KL Rahul, Yashasvi Jaiswal, Abhimanyu Easwaran, Shubman Gill, Rishabh Pant (WK), Sarfaraz Khan, Dhruv Jurel (WK), Ravichandran Ashwin, Ravindra Jadeja, Mohammad Siraj, Akash Deep, Prasidh Krishna, Harshit Rana, Nitish Kumar Reddy, Washington Sundar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular