ముంబై: India vs Bangladesh: బీసీసీఐ బంగ్లాదేశ్‌తో జరుగనున్న రెండో టెస్టుకు జట్టును ప్రకటించింది. టీమిండియా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను విజృంభనగా ప్రారంభించింది.
చెన్నైలో జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఈ విజయంతో, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 27 నుండి కాన్పూర్‌లో జరగనున్న రెండో టెస్టు కోసం భారత జట్టును ప్రకటించారు.
తొలి టెస్టులో ఆడిన జట్టులో ఎటువంటి మార్పులు చేయకుండా, అదే జట్టుతో రెండో టెస్టుకు బరిలో దిగనుంది.
India vs Bangladesh: భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్.