న్యూఢిల్లీ: టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటనకు బయల్దేరే జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మను కూడా చేర్చారు. మొదట విడుదల చేసిన భారత క్రికెట్ జట్టులో రోహిత్‌ను పక్కకు పెట్టడంతో పెద్ద దుమారం లేచింది. అయితే ఫిట్నెస్ పరంగా రోహిత్ బాగానే ఉన్నా అతన్ని ఎందుకు చేర్చలేదనే చాలా విమర్శలు వచ్చాయి.
ఇప్పుడు తాజాగా రివైజ్డ్ జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జాబితాలో రోహిత్‌కు చోటు కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. కేవలం టెస్టు జట్టులో మాత్రమే రోహిత్‌కు చోటిచ్చిన సెలక్టర్లు వన్డే, టీ20 సిరీస్‌లకు విశ్రాంతి ఇచ్చారు.
రోహిత్‌తో బీసీసీఐ మెడికల్ టీమ్ సంప్రదించిన తర్వాతే అతనికి వన్డే, టీ20లకు రెస్ట్ ఇస్తున్నట్లు సెలక్షన్ కమిటీ స్పష్టం చేసింది. రోహిత్ ఫిట్నెస్ను బీసీసీఐ మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. ఆ క్రమంలోనే సీనియర్ సెలక్షన్ కమిటీకి నివేదిక అందజేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ ఆరంభం కానుంది. డిసెంబర్ 8వ తేదీతో పరిమిత ఓవర్ల సిరీస్ ముగియనుండగా, డిసెంబర్17వ తేదీ నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం అవుతుంది.