తెలంగాణ: బీర్ల ధరలు 15 శాతం పెరుగనున్నాయి. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ నిర్ణయం తీసుకుని, నేటి నుండి అమలులోకి తెచ్చింది. పెరిగిన ధరల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు ₹700 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.
ధరల పెరుగుదలతో వివిధ బ్రాండ్ల బీర్లు మరింత ఖరీదయ్యాయి. లైట్ బీరు ₹150 నుంచి ₹172కు, కింగ్ ఫిషర్ ప్రీమియం ₹160 నుంచి ₹184కు చేరుకుంది. బడ్వైజర్ లైట్ ₹210 నుంచి ₹241.5కి, టుబోర్గ్ స్ట్రాంగ్ ₹240 నుంచి ₹276కి పెరిగింది.
ప్రభుత్వానికి ఆదాయం పెరిగినప్పటికీ, వినియోగదారులకు ఇది భారంగా మారనుంది. బీర్ల ధరలు పెరగడం వల్ల మద్యం వినియోగం తగ్గే అవకాశముందని, దీని ప్రభావం వైన్స్ మరియు బార్లపై పడుతుందని అంటున్నారు.
కొన్ని వర్గాలు ఈ పెరుగుదలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సామాన్య వినియోగదారులకు ఇది ఎక్కువ భారం కావచ్చని చెబుతున్నారు.
మద్యం ధరల పెంపుపై ప్రభుత్వ సపష్టికరణ ఏమిటో, ప్రజలపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి.