మూవీడెస్క్: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుసగా నాలుగు ప్రాజెక్టులు సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ‘అల్లుడు అదుర్స్’ తర్వాత, అతని ప్రయాణం బాలీవుడ్ వరకు వెళ్ళింది.
హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్ తో బిగ్ సక్సెస్ అందుకోవాలని అనుకున్నాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది.
ఇప్పుడు, సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరగుతోంది.
అంతే కాకుండా, లుదీర్ భైరెడ్డి దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. విజయ్ కుమార్ కనకమేడలతో మరో సినిమా కూడా లైన్ లో పెట్టినట్లు సమాచారం.
ఈ చిత్రం తమిళ హిట్ ‘గరుడన్’ కు రీమేక్ అవుతుందని, ‘వీర ధీర శూర’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో నారా రోహిత్, మంచు మనోజ్ ముఖ్య పాత్రలు చేయనున్నారు.
ఇక, కౌశిక్ దర్శకత్వంలో కూడా మరో ప్రాజెక్ట్ సిద్ధంగా ఉంది. నాలుగు సినిమాలు ప్లాన్ చేస్తూ, సాయి శ్రీనివాస్ తిరిగి తన కెరీర్ పై ఫోకస్ పెట్టాడు.
మరి ఈ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.